మరింత సహకారం.. | - | Sakshi
Sakshi News home page

మరింత సహకారం..

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

సాక్షి, మహబూబాబాద్‌/ బయ్యారం: రైతులకు ప్రభుత్వ పథకాలు మరింత చేరువలోకి తీసుకొచ్చేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా నూతన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌)ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా రైతులకు కావాల్సి న ఎరువులు, విత్తనాలు, ఇతర సబ్సిడీ పరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇందుకోసం 45 అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ రాష్ట్ర సహకారశాఖ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా ఐదు..

ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ప్రతీ మండల కేంద్రంతో పాటు, పలు మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏర్పాటు చేశారు. ఈ సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ద్వారా మండలస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా ప్రతినిధులను ఎంపిక చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలు, డివిజన్లు, మండలాలు, కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల విస్తరణ జరగలేదు. దీంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటి వరకు జిల్లాలో 19 సంఘాలు ఉండగా.. మరో ఎనిమిది కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు 2025 జనవరిలో ప్రతిపాదనలు పంపించారు. కొత్తగూడ మండలంలో పొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు తోడుగా కొత్తగూడ, గంగారం ప్రాంతాల్లో, గూడూరు పీఏసీఎస్‌ పరిధిలోని అప్పరాజుపల్లి, అయోధ్యాపురం, గార్ల సంఘం పరిధిలోని రాంపురంలో, కొత్తగా ఏర్పడిన దంతాలపల్లి, చిన్నగూరు, ఇనుగుర్తి ప్రంతాల్లో మొత్తం ఎనిమిది కొత్త సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇందులో గార్ల పీఏసీఎస్‌ పరిధిలో ముల్కనూరు, బయ్యారం పరిధిలో అడవి కంబాలపల్లితోపాటు కొత్తగా ఏర్పడిన పెద్దవంగర, దంతాలపల్లి, గంగారంలో ఐదు కొత్త పీఏసీఎస్‌లు మంజూరు చేశారు.

బయ్యారం పీఏసీఎస్‌ కార్యాలయం

గార్ల ముల్కనూరు

తొర్రూరు పెద్దవంగర

పొగుళ్లపల్లి గంగారం

జిల్లాలో కొత్తగా ఐదు పీఏసీఎస్‌ల ఏర్పాటు

ఉత్తర్వులు జారీ చేసిన సహకారశాఖ

విభజన పనిలో అధికారులు

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే విభజన

జిల్లా అవసరాల నేపథ్యంలో కొత్తగా పీఏసీఎస్‌ల ఏర్పాటుకోసం గతంలో ప్రతిపాదనలు పంపించాం. వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు కొత్తగా ఐదు పీఏసీఎస్‌లు మంజూరు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే.. విభజన ప్రక్రియ మొదలవుతుంది. – సర్దార్‌ సింగ్‌, డీసీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement