కర్నూలు: రాయలసీమ నాల్గవ జోన్ పరిధిలోని వివిధ సబ్ డివిజన్లలో పనిచేస్తున్న డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు డీజీపీ హరీష్‌కుమార్ గుస్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పత్తికొండ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వెంకటరామయ్యను అన్నమయ్య జిల్లా రాజంపేటకు బదిలీ చేశారు. అలాగే గుంతకల్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న ఆముదాల శ్రీనివాసులను ఖాళీగా ఉన్న ఎమ్మిగనూరు డీఎస్పీగా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న మాగల చంద్రశేఖర్‌ను ఖాళీగా ఉన్న అనంతపురం జిల్లాకు కేటాయించారు. కరుణాకర్‌రావును అనంతపురం టౌన్‌కు, వెయిటింగ్‌లో ఉన్న బొల్లినేని శ్రీనివాసరావును గుంతకల్‌కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
క్వింటా ఉల్లి రూ.4,300
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 5,104 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు(137 లాట్లు) విక్రయానికి వచ్చాయి. ఉల్లి పంటకు ఒకటి, రెండు నీటి తడులు ఇచ్చిన రైతులకు ఒక మోస్తరుగా పంట వస్తోంది. కనిష్ట ధర రూ.721, గరిష్ట ధర రూ.4,300 లభించగా.. సగటు ధర రూ.3,350 నమోదైంది. మార్కెట్‌కు వేరుశనగ 170 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.3,519, గరిష్ట ధర రూ.9,009 లభించగా.. సగటు ధర రూ.6,802 పలికింది. మినుములకు రూ.8,219 ధర లభించింది.
నేడు స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానం
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శుక్రవారం స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డులను ప్రదానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో 23 విభాగాల్లో 64 అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు ఐదు అవార్డులు వచ్చాయని, శుక్రవారం విజయవాడలో ప్రదానం చేయనున్నట్లు వివరించారు. పత్తికొండ గ్రామ పంచాయతీ, ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కర్నూలు సి.క్యాంప్ రైతుబజార్, కోగిలతోట విలేజ్ ఆర్గనైజేషన్‌కు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ విభాగంలో గూడూరుకు నగర పంచాయతీకి చెందిన ఎం. దుర్గ ఎంపికయ్యారని కలెక్టర్ తెలిపారు.


