రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 2.0 కింద గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో 165 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసేందుకు రూ.109.42 కోట్లతో 1131 పనులను మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి రూ.92.34 కోట్ల వ్యయంతో 160.94 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన ట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రూ.11.43 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన 174 పనులు వివిధ కారణాల వల్ల చేపట్టలేకపోయారు. అయి తే, మార్చి నెలలో పూర్తయిన ఈ పనులకు సంబంధించిన బిల్లులు నేటికీ నయాపైసా విడుదల కానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2.0 కింద పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులే నేటికీ విడుదల కాకపోవ డం వల్ల 3.0 కింద పనులు చేపట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేద ని ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లు చెబుతున్నారు.


