గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ప్రజాసేవ కోసం వలంటీర్లు నియమించి గౌరవవేతనం రూ.5 వేలు ఇచ్చింది. అప్పటి ఎల్లో మీడియాతో కలసి టీడీపీ నాయకులు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటూ గగ్గోలు పెట్టారు. అప్పట్లో మేం ఇంటింటికి తి రి గి సంక్షేమ పథకాలతో పాటు రేషన్, పింఛన్లు అందజేస్తూ..అన్ని విషయాల్లో ప్రజలకు అండగా ఉన్నాం. అప్పటి ప్రభుత్వం ఇస్తున్న వేతనాన్ని రూ.10 వేలు చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పింది. ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొట్టి వలంటీర్లును రోడ్డున పడే విధంగా చేసింది. వలంటీర్ వ్యవస్థ తొలగించి సీఎం చంద్రబాబు నేడు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు రూ. లక్షలు దోచిపెట్టేందుకు సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ల పాలసీ తీసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టెందుకే ఈ పాలసీ.
– రామేశ్వరరెడ్డి, పెద్దకొత్తిలి
మాజీ వలంటీర్, నందవరం మండలం


