ఊడిపడిన కోర్టు భవనం పైకప్పు | - | Sakshi
Sakshi News home page

ఊడిపడిన కోర్టు భవనం పైకప్పు

Oct 1 2026 1:11 AM | Updated on Oct 1 2026 1:11 AM

● త్రుటిలో తప్పిన ప్రమాదం

● త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆత్మకూరురూరల్‌: ఆత్మకూరు కోర్టుల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్ని గదులు మూసివేసి ఉన్నంత మేరలో సర్దుకుని సిబ్బంది, న్యాయవాదులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం హఠాత్తుగా సిబ్బంది పనిచేసుకునే గది పైకప్పు ఊడి పడింది. ఆ సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటికే భవనం పరిస్థితి తెలిసి దాన్ని కూల్చివేసి కొత్త భవన నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాల్సిందిగా స్థానిక న్యాయమూర్తులు నివేదిక పంపారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు భవన పరిస్థితిని అంచనావేసేందుకు వచ్చి తాత్కాలిక మరమతులు మాత్రమే చేయాల్సి ఉందని చెప్పడం ఇబ్బందిగా మారింది. ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవనాల పరిస్థితి గమనించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో తాత్కాలికంగా కోర్టులను నడుపుకునేందుకు అనుమతినిచ్చారు. అయితే ఆత్మకూరుకు అదనంగా మరో మేజిస్ట్రేట్‌ కోర్టు కూడా మంజూరు కావడంతో శాప్‌కు చెందిన ఆ భవనంలో మూడు కోర్టులు పని చేయాల్సి ఉంది. పాత కోర్టు భవనం కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించాల్సిందిగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement