ఎంఈవో, హెచ్‌ఎం టీడీపీతో కుమ్మక్కయారు | - | Sakshi
Sakshi News home page

ఎంఈవో, హెచ్‌ఎం టీడీపీతో కుమ్మక్కయారు

Oct 1 2026 1:11 AM | Updated on Oct 1 2026 1:11 AM

స్పందించకుంటే కోడుమూరు–బళ్లారి రోడ్డును స్తంభింపజేస్తాం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి వెల్లడి

కర్నూలు(టౌన్‌): స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికల్లోనూ టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ మండలంలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలో చైర్మన్‌గా గంగాధర్‌ అనే వ్యక్తి సింగిల్‌ నామినేషన్‌ వేశారన్నారు. అయితే సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎందుకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించలేదన్నారు. అక్కడ లా అండ్‌ అర్డర్‌ సమస్య లేకపోయినా అధికారులు ఎన్నిక నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఎన్నికల్లో పోలింగ్‌ జరిగినా.. టీడీపీ నాయకులతో కుమ్మకై ్క మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు ఫలితం ప్రకటించలేదన్నారు. చివరికి పాఠశాల ఎన్నికల్లోనూ చొరబడి టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. వారికి అధికార యంత్రాంగం మద్దతివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి వెంటనే స్పందించి జిల్లా విద్యాశాఖాధికారితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన ఎంఈవో, హెచ్‌ఎంలపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కోడుమూరు–బళ్లారి రోడ్డును స్తంభింపజేస్తామన్నారు. న్యాయం జరగని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

దేవనకొండ విద్యా కమిటీ ఎన్నికలపై కలెక్టర్‌ స్పందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement