పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి | - | Sakshi
Sakshi News home page

పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి

Oct 1 2026 1:11 AM | Updated on Oct 1 2026 1:11 AM

1.98 లక్షల ఎకరాల్లో ప్రీ–మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ ● పీఎండీఎస్‌ స్కోచ్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ కావడం సంతోషకరం

కర్నూలు: పదవీ విరమణ బెనిఫిట్స్‌ విషయంలో సమస్యలు ఎదురైతే తనను నేరుగా కలసి పరిష్కరించుకోవచ్చనని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. 44 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ (అటాచ్‌మెంట్‌–కర్నూలు పీసీఆర్‌)లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సోమ్లానాయక్‌ పదవీ విరమణ పొందారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ్లా నాయక్‌ను శాలువ, పూలమాలలతో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ మధుసూదన్‌రావు, ఆర్‌ఐ నారాయణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొని సోమ్లానాయక్‌ దంపతులకు ఘనంగా వీడ్కోలు పలికారు. బంజారా జాతికి చెందిన సోమ్లానాయక్‌ దంపతులను బంజారాల తరపున ఘనంగా పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.

సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ ఆరా

వెల్దుర్తి: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో సమస్యాత్మక గ్రామాలపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎస్‌ఐ నరేశ్‌ ఆదేశించారు. వెల్దుర్తిలో ట్రాఫిక్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు.

ఉత్తమ పంచాయతీగా పత్తికొండ

కర్నూలు (అర్బన్‌): రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పత్తికొండ ఎంపికై ంది. పంచాయతీ పరిధిలో పరిశుభ్రమైన వాతావర ణం కల్పించారు. ప్రజలకు అవసరమైన మౌ లిక వసతులు ఏర్పాటు చేశారు. స్వచ్ఛాంధ్ర స్టేట్‌ లెవెల్‌ అవార్డ్స్‌ 2026కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఉత్తమ గ్రామ పంచాయతీగా పత్తికొండ ఎంపికై నట్లు ప్రభుత్వం నుంచి బుధవారం రాత్రి సమాచారం అందింది. ఈనెల 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఇ.భాస్కర్‌ అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోనున్నారు. స్వచ్ఛాంధ్ర స్టేట్‌ లెవెల్‌ అవార్డు మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన పత్తికొండకు రావడంపై డీపీఓ, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, డీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రీ–మాన్సూన్‌ డ్రై సోయింగ్‌(పీఎండీఎస్‌) స్కోచ్‌ అవార్డుకు నామినేట్‌ కావడం సంతోషకరమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆమె పీఎండీఎస్‌ను స్కోచ్‌ అవార్డుకు నామినేట్‌ చేసిన నేపథ్యంలో వివిధ శాఖల డైరెక్టర్లు, స్కోచ్‌ గ్రూప్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పీఎండీఎస్‌ ద్వారా సాధించిన ఫలితాలపై కలెక్టర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాకాలానికి ముందే పొడి నేలల్లో వివిధ రకాల పంటల విత్తనాలను చిన్న చిన్న గుళికలుగా చేసి విత్తే ప్రీ–మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ విధానాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్లు స్కోచ్‌ గ్రూప్‌ ప్రతినిధులకు వివరించారు. జిల్లాలో సుమారు 8 లక్షల హెక్టార్ల సాగుభూమిలో 75 శాతం వర్షాధార ప్రాంతం ఉండటంతో పీఎండీఎస్‌ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 1,98,464 ఎకరాల్లో పీఎండీఎస్‌ విధానంలో 1,84,764 మంది రైతులు భాగస్వామ్యమైనట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఓ భారతి, న్యాచురల్‌ ఫార్మింగ్‌ అధికారి మాధురి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement