అవగాహనతోనే హెచ్‌ఐవీ రహిత సమాజం | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే హెచ్‌ఐవీ రహిత సమాజం

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

కర్నూలు(హాస్పిటల్‌): అవగాహనతోనే హెచ్‌ఐవి రహిత సమాజం సాధ్యమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అన్నారు. శుక్రవారం ఎయిడ్స్‌ నివారణ ప్రచారంలో భాగంగా కోల్స్‌ కాలేజి నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు 5 కె రన్‌ నిర్వహించిన సందర్భంగా నంద్యాల చెక్‌పోస్టు వద్ద రన్‌లో పాల్గొన్న విజేతలకు కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చికిత్స తీసుకోవడం ద్వారా హెచ్‌ఐవితో జీవిస్తున్న వారు సాధారణ జీవితం కొనసాగించవచ్చన్నారు. ఈ యేడాది జిల్లాలో పిల్లల్లో కొత్త హెచ్‌ఐవి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడం సంతోషకరమైన విషయమన్నారు. అయితే ముగ్గురు గర్భిణిల్లో హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించామని, వారికి నిరంతరం వైద్యపర్యవేక్షణ, చికిత్స అందిస్తూ వారి పిల్లలకు సంక్రమణ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోవడంలో ఎలాంటి సిగ్గు, భయం అవసరం లేదన్నారు. 5కె రన్‌ పోటీల్లో పురుషుల్లో మొదటి బహుమతి పి.బషీర్‌, రెండవ బహుమతి కె.వెంకటభారత్‌, మహిళల విభాగంలో మొదటి బహుమతి డి.వెంకటేశ్వరి, రెండవ బహుమతి పి.రామలక్ష్మి సాధించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వై.కామేశ్వరప్రసాద్‌, జిల్లా ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసి, టీబీ అధికారి డాక్టర్‌ ఎల్‌.భాస్కర్‌, డీఎస్‌డీఓ భూపతిరావు, క్లస్టర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అలీ హైదర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement