నదుల్లో జలసవ్వడి | - | Sakshi
Sakshi News home page

నదుల్లో జలసవ్వడి

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

పొంగిపొర్లుతున్న తుంగభద్ర

నందవరం: నిన్నటివరకు వెలవెలబోయిన తుంగభద్రమ్మ నేడు వానల రాకతో జలకళ సంతరించుకుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత మూడురోజులుగా కురిసిన వర్షాలతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం మండల పరిధిలోని నాగలదిన్నె బ్రిడ్జి వద్ద వరద నీటితో తుంగభద్ర నది ఉధృతంగా పారుతోంది. కర్ణాటకలోని హగిరి, బళ్లారి, శివమొగ్గ తదితర ప్రాంతాలతో పాటు ఆదోని, కౌతళం, కోసిగి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో తుంగభద్ర నదికి వరద నీరు వచ్చి చేరింది. కాగా తుపాను తాకిడికి పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో పత్తి నేల రాలింది, మరికొన్ని ప్రాంతాల్లో కాయలు కుళ్లిపోతున్నాయని, పత్తి తడిసి రంగు మారుతోందని రైతులు వాపోయారు.

కుందూనదికి వరద ఉధృతి

కోవెలకుంట్ల: ఎగువ ప్రాంతాలతోపాటు కోవెలకుంట్ల వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో కుందూనదికి వరద పోటెత్తింది. నీరంతా నదిలోకి చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గత నెలలో శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ అధికారులు నదికి విడుదల చేయలేదు. దీంతో పంటల సాగుకు అదును దాటిపోయింది. ప్రస్తుతం నదిలో నీరు చేరినా అదును దాటాక ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు పెదవి విరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement