శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు, అర్చకులు ఆశీర్వదించగా, దేవస్థానం చైర్మన్, ఈవో స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికతో సత్కరించారు.
బైక్ దొంగకు జైలు శిక్ష
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి ఫారం వద్ద బైక్‌ను అపహరించిన కేసులో నిందితుడు వడ్డె మహేష్‌కు మెజిస్ట్రేట్ పి.హేమ ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన గొల్ల వెంకటరావు తన బైక్‌ను 2026 మే 17న బనవాసి ఫారం సాయిబాబా దేవాలయం వద్ద ఉంచి ఎమ్మిగనూరుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా బైక్ కనిపించకపోవటంతో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టగా పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళంకు చెందిన వడ్డె మహేష్ బైక్‌ను అపహరించినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని వెల్లడించారు.


