కరువును కప్పిపుచ్చే కుట్రలు | - | Sakshi
Sakshi News home page

కరువును కప్పిపుచ్చే కుట్రలు

Sep 23 2026 1:49 AM | Updated on Sep 23 2026 1:49 AM

● జిల్లాలో 11 మండలాల్లో సాధారణ పరిస్థితులట ● 7 మండలాల్లో తీవ్రం, 8 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు లెక్కలు ● నంద్యాల జిల్లాలో 26 మండలాల్లో తీవ్ర కరువు, 2 మండలాల్లో మధ్యస్థం ● అన్ని మండలాల్లో దిగుబడి లాస్‌ 90 శాతంపైనే.. ● కరువు మండలాల గుర్తింపులో వింత లెక్కలు

● జిల్లాలో 11 మండలాల్లో సాధారణ పరిస్థితులట ● 7 మండలాల్లో తీవ్రం, 8 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు లెక్కలు ● నంద్యాల జిల్లాలో 26 మండలాల్లో తీవ్ర కరువు, 2 మండలాల్లో మధ్యస్థం ● అన్ని మండలాల్లో దిగుబడి లాస్‌ 90 శాతంపైనే.. ● కరువు మండలాల గుర్తింపులో వింత లెక్కలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వం కరువు తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు కర్నూ లు, అటు నంద్యాల జిల్లాల్లోని అన్ని మండలాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు తీవ్రత ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కర్నూలు జిల్లాలోని 11 మండలాలు, నంద్యాల జిల్లాలో ఒక మండలంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలు స్తోంది. కరువు మండలాలను గుర్తించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పంటల సా గు, రెయిన్‌ఫాల్‌, భూగర్భ జలాల లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో 11 మండలాలు, నంద్యాల జిల్లాలో ఒక మండలంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వివరాల ప్రకారం జిల్లాలో కల్లూరు, పెద్దకడుబూరు మండలాల్లో కరువు తీవ్రత లేదని తేల్చడం గమనార్హం. జిల్లా యంత్రాంగం లెక్కల ప్రకారం మరో 9 మండలాల్లో కరువు లేదని స్పష్టమవుతోంది.

● జిల్లాలో 26 మండలాలు ఉండగా అన్నిచోట్ల కరువు విలయతాండవం చేస్తోంది. నీటి ఆధారం కింద సాగు చేసిన పంటల్లో కొంతమేర దిగుబడులు ఉన్నప్పటికీ వర్షాధార భూముల్లో దిగుబడులు జీరో ఉన్నట్లు పంట కోత ప్రయోగాలే స్పష్టం చేస్తున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం పంట నష్టం 33 శాతం ఆపైన ఉంటే కరువు ఉన్నట్లే.. కర్నూలు జిల్లాలో వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారమే 1,10,800 హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. పత్తి 63.470 హెక్టార్లు, కంది 31,340, వేరుశనగ 10,910, మొక్కజొన్న 1030, ఆముదం 2525, సజ్జ 1525 హెక్టార్లలో ఎండిపోయినట్లు స్పష్టమవుతోంది. వర్షాధారం పంటలన్నీ పూర్తిగా పనికిరాకుండా పోయాయి. కరువును తగ్గించి చూపేందుకు చంద్రబాబు సర్కారు ముమ్మరంగా ప్రయత్నిస్తుండటం గమనార్హం.

● కర్నూలు జిల్లాలో సాధారణ సాగు 4,22,540 హెక్టార్లు ఉండగా 3,48,389 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. కాల్వలు, ట్యాంకులు కింద ఒక్క ఎకరా కూడా సాగు కాలేదు. ఎత్తిపోతల పథకాల కింద 2,647 హెక్టార్లలో, బావులు, బోర్ల కింద 23,005 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 3,22,737 హెక్టార్లలో పూర్తిగా వర్షాధారం కిందనే సాగు చేయగా ఇవన్నీ పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు 2025 ఆగస్టులో జిల్లా సగటున 6.36 మీటర్లలో ఉండగా 2026 ఆగస్టులో 8.64 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఏకంగా 2.27 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. అయితే 11 మండలాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ నివేదిక రూపొందించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 7 మండలాల్లో తీవ్ర కరువు, 8 మండలాల్లో మధ్యస్థం, 11 మండలాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నట్లు తేల్చారు. కరువు తీవ్రతను తగ్గించి చూపి రైతులకు అన్యాయం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

● కర్నూలు జిల్లాలో వెల్దుర్తి, ఓర్వకల్‌, గూడూరు, కర్నూలు రూరల్‌, హొళగొంద, హలహర్వి, చిప్పగిరి మండలాల్లో తీవ్ర కరువు, గోనెగండ్ల, ఆలూరు, కర్నూలు అర్బన్‌, కృష్ణగిరి, పత్తికొండ, తుగ్గలి, కోడుమూరు, మద్దికెరలో కరువు మధ్యస్థంగా ఉన్నట్లు నివేదిక రూపొందించారు. కొసిగి, కల్లూరు, పెద్దకడుబూరు, సి.బెళగల్‌, దేవనకొండ, ఆదోని, కౌతాళం, మంత్రాలయం, ఆస్పరి, నందవరం, ఎమ్మిగనూరు మండలాల్లో సాధారణమని (నార్మల్‌) పేర్కొనడం గమానార్హం. ప్రభుత్వం నుంచే కల్లూరు, పెద్దకడుబూరు మండలాల్లో కరువు లేదని రావడంతో వాటిని కరువు మండలాలుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రత్యేక రిపోర్టు పంపినట్లు తెలుస్తోంది. మిగిలిన మండలాలను కూడ దిగుబడి లాస్‌ కింద కరువు మండలాలుగా గుర్తించాలని కోరుతున్నారు.

నంద్యాల జిల్లాలో 28 మండలాల్లో కరువు

నంద్యాల జిల్లాలో మొదటిసారిగా నీటి వసతి కింద పంటల సాగుకు చంద్రబాబు సర్కారు విరామం ప్రకటించింది. 28 మండలాల్లో కరువు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. దిగుబడి నష్టం 33 శాతం నుంచి 49.9 శాతం ఉంటే కరువు మధ్యస్థంగా వ్యవహరిస్తారు. ఈ ప్రకారం చాగలమర్రి మండలంలో 36 శాతం, కొలిమిగుండ్ల మండలంలో 47–48 శాతం దిగుబడి లాస్‌ ఉన్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారించింది. ఈ మండలాల్లో కరువు మద్యస్థంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. పాములపాడులో 90–92 శాతం, కొత్తపల్లిలో 90 శాతం దిగుబడి లాస్‌ ఉన్నట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. నందికోట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, ఆత్మకూరు, మిడుతూరు, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల రూరల్‌, మహనంది, శిరువెల్ల, గోస్పాడు, బనగానపల్లి, డోన్‌, ప్యాపిలి, అవుకు, కోవెలకుంట్ల, రుద్రవరం ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యలవాడ, నంద్యాల అర్బన్‌ మండలాల్లో దిగుబడి లాస్‌ 50 శాతం నుంచి 88 శాతం వరకు ఉన్నట్లు తేల్చారు. సంజామల మండలం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నామ్స్‌ ప్రకారం కరువు మండలంగా రావడం లేదు. అయితే జిల్లా కలెక్టర్‌ ద్వారా సంజామలను కరువు మండలంగా గుర్తించేందుకు ప్రత్యేకంగా రిపోర్టు రాసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement