కర్నూలు(అగ్రికల్చర్): చేనేత పింఛన్ల మంజూరులో అర్హులందరికీ న్యా యం చేస్తామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచా లకులు పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. పింఛన్ మంజూరు చేయిస్తామనే దళారుల మాటలు నమ్మవద్దని, అర్హతకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈయన తిరుపతిలో చేనేత ఎన్‌పోర్స్‌మెంటులో ఏడీగా పనిచేస్తూ.. పూర్తి అదనపు బాధ ్యతలతో ఇక్కడ ఏడీగా బాద్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 520, నంద్యాల జిల్లాలో 200 పింఛన్ ధరఖాస్తులను పరిశీలించి రెకమెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి పరిశీలన తర్వాతే పింఛన్లకు రెకమెండ్ చేస్తున్నామన్నారు. అర్హులందరికీ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


