వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి

Sep 23 2026 1:49 AM | Updated on Sep 23 2026 1:49 AM

● కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏపీఈఎంసీఎల్‌ చైర్మన్‌ పర్యటన

● కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏపీఈఎంసీఎల్‌ చైర్మన్‌ పర్యటన

కర్నూలు(సెంట్రల్‌): హానికర వ్యర్థాల నిర్వహణలో పర్యావరణ నిబంధనలు కచ్చితంగా పాటించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఏపీ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఈఎంసీఎల్‌) చైర్మన్‌ పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి కంపెనీల యాజమాన్యాలు, అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించారు. నగరంలోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, జోనల్‌ కార్యాలయాలను సందర్శించారు. అధికారులతో సమావేశమై హానికర వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల పర్యవేక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలంలోని అస్కెన్షన్‌ మెర్చెంటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హానికర వ్యర్థాల ప్రీ–ప్రాసెసింగ్‌ యూనిట్‌ను తనిఖీ చేశారు. యూనిట్‌లో హానికర వ్యర్థాలను స్వీకరించడం, ప్రీ–ప్రాసెసింగ్‌ చేయడం వంటి ప్రక్రియలను పరిశీలించారు. ప్రీ–ప్రాసెసింగ్‌ చేసిన హానికర వ్యర్థాలను నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సిమెంట్‌ పరిశ్రమలకు పంపుతున్నారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించడంతో పాటు యూనిట్‌ నిర్వహణ రికార్డులను పరిశీలించారు. పరిశ్రమకు సంబంధించిన హానికర వ్యర్థాల నిర్వహణ వివరాలను ఏపీఈఎంసీఎల్‌ పోర్టల్‌ ద్వారా పరిశీలించారు. హానికర వ్యర్థాల రవాణా, కదలికను పర్యవేక్షించేందుకు వినియోగిస్తున్న జీపీఎస్‌ ఆధారిత ట్రాకింగ్‌ వ్యవస్థను కూడా తనిఖీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశ్రమ ప్రాంగణంలో మొక్కను నాటారు. పరిశ్రమ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు. ఏపీపీసీబీ జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ ఓ.రమేష్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరు పీవీ కిషోర్‌ రెడ్డి వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement