అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు

Sep 23 2026 1:49 AM | Updated on Sep 23 2026 1:49 AM

● ప్రత్యేక బృందాలతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు ● రైతు బజార్లలో కేజీ బియ్యం రూ.50కే లభ్యం

● ప్రత్యేక బృందాలతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు ● రైతు బజార్లలో కేజీ బియ్యం రూ.50కే లభ్యం

కర్నూలు(సెంట్రల్‌): నిత్యావసర సరుకులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నూరుల్‌ఖమర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రజల పై అదనపు భారం పడకుండా నిర్ణయించిన ధరకు సరుకుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సగటు ధరల మేరకు బియ్యం కిలో రూ.56, ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ రూ.178, కందిపప్పు కిలో రూ.120 చొప్పున విక్రయించేలా ఆదేశాలు ఇచ్చినా సరైన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర సగటు ధరకు మించి సరుకులను విక్రయిస్తే చర్యలు తప్పవని మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులను హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ, లీగల్‌ మెట్రాలజీ, కమర్షియల్‌ ట్యాక్స్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఫుడ్‌ సేఫ్టీ, లేబర్‌, ఫైర్‌ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని డీఎస్‌ఓను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమ నిల్వలు, అధిక ధరకు విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు రైతు బజార్లలో రూ.50కే కిలో బియ్యం ప్రకారం ఒక్కో కుటుంబానికి 25 కేజీలు ఇవ్వాలన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్‌, డిస్ట్రిక్ట్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ రెడ్డి, మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నారాయణమూర్తి, లీగల్‌ మెట్రాలజీ అధికారి శ్రీరాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement