‘వేమన పద్యామృతం – ఆధ్యాత్మిక వ్యాఖ్యానం’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘వేమన పద్యామృతం – ఆధ్యాత్మిక వ్యాఖ్యానం’ పుస్తకావిష్కరణ

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

కర్నూలు కల్చరల్‌: అఖిల ప్రపంచ ప్రధాన కేంద్రం మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో ఆదివారం వీఆర్‌ కాలనీలోని ఏపీ టూరిజం హరిత హోటల్‌లో దేశీయ సమైక్యతా సమావేశం జరిగింది. దేవాశీర్‌ రచించిన ‘వేమన పద్యామృతం – ఆధ్యాత్మిక వ్యాఖ్యానం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయమనోహరి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, రియల్టర్‌ కె.విక్రమ్‌ సేనా రెడ్డి, ఏపీటీడీసీ డివిజినల్‌ మేనేజర్‌ లక్ష్మీనారాయణ, ప్రముఖ నేపథ్య గాయకులు రాగ్‌సాగర్‌, తెలుగు బాషా నిర్దేశకులు డాక్టర్‌ బోలుగద్దె అనిల్‌కుమార్‌ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అనేక భాషల్లో ముద్రితమైనన ఈ పుస్తకం తేలికగా అర్థం చేసుకునే విధంగా ఉంటుందన్నారు. ఒకే దేవుడు – ఒకే దేశం అనే సిద్ధాంతంతో అనేక ఆధ్యాత్మిక విషయాలు యువతరం చదివి అర్థం చేసుకునేలా ఉందన్నారు. అధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా అమూల్య జ్ఙానం పొందవచ్చన్నారు. అనంతరం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement