ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్చి | - | Sakshi
Sakshi News home page

ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్చి

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

ఖాతాలోని రూ.62 వేలను

కాజేసిన దుండగుడు

ఆదోని అర్బన్‌: ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మహిళను గుర్తు తెలియని వ్యక్తి మాటల్లో పెట్టి కార్డును తీసుకుని, తన వద్దనున్న నకిలీ కార్డును ఇచ్చి ఆమె ఖాతాలోని రూ.62 వేలను కాజేసిన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆదోని, ఇందిరానగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ తిమ్మక్క తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదరు మహిళకు డబ్బు అవసరం ఉండడంతో గత నెల 28న ఆస్పరి రోడ్డులో ఉన్న ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లింది. ఏటీఎంలో నగదు విత్‌ డ్రా చేయడం తెలియకపోవడంతో పక్కనున్న గుర్తు తెలియని వ్యక్తిని సాయం కోరింది. అతడు నగదు డ్రా చేస్తున్నట్లు నటించి, మిషన్‌లో డబ్బు రావడం లేదని చెప్పి ఆమె కార్డును తీసుకొని బదులుగా తన వద్దనున్న మరో కార్డును ఆమెకు ఇచ్చాడు. తనకు రూ.9 వేలు డబ్బు అత్యవసరం ఉందని ఆమె చెప్పడంతో ఆ వ్యక్తి తన వద్ద నగదు ఉందని రూ.30 కమీషన్‌తో కలిపి మొత్తం ఫోన్‌పే చేయించుకుని నగదు ఇచ్చాడు. తర్వాత ఎవరి దిక్కు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తిమ్మక్క మరోసారి డబ్బు అవసరమై ఏటీఎంలో డ్రా చేసేందుకు వెళ్లగా కార్డు తనది కాదని తెలుసుకుంది. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్‌ చూసుకోవడంతో రూ.62 వేలు డ్రా చేసినట్లు తెలుసుకుని ఆదివారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement