కర్నూలులోని పలు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి చివరి నిమిషంలో రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో డబ్బులు అయిపోయాక గత్యంతరం లేని పరిస్థితిలో పెద్దాసుపత్రికి వస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో అవసరమైన వైద్యం అందించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే మరణాల సంఖ్య ప్రైవేటుతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయి. కీలక విభాగాల్లో రోగులకు చికిత్స అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. వైద్యసేవల విషయంలో ఎలాంటి లోపమూ ఉండదు.
–డాక్టర్ కె.వెంకటేశ్వర్లు,
సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు


