పెళ్లి వద్దని చెప్పడంతో.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దని చెప్పడంతో..

Aug 16 2026 5:21 AM | Updated on Aug 16 2026 5:21 AM

రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో కర్నూలుకు పతకాలు

పత్తికొండ రూరల్‌: ‘ఈ ఏడాది పంటలు సరిగా లేవు, పెళ్లి చేసే వయస్సు కూడా కాదు’ అని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు .. పందికోన గ్రామానికి చెందిన సంజప్ప కుమారుడు నరసింహుడు (18) ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయాలని కోరగా తల్లిదండ్రులు ఇప్పుడే వద్దనడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతి

జూపాడుబంగ్లా: నేషనల్‌ హైవే 340సీపై మండ్లెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌ మృతి చెందా డు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పారుమంచాల గ్రామానికి చెందిన సామేలు(45) ఉదయం ఆటోలో నందికొట్కూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో మండ్లెం గ్రామం నుంచి తర్తూరు అంచెవద్ద హైవే 340సీ రోడ్డును క్రాస్‌ చేస్తుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆటో డ్రైవర్‌ సామేలు కిందపడటంతో అతని తలకు తీవ్ర గాయం కావడంతో 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే లోపు మృతి చెందాడు. కారులో ఉన్న వారు తృటిలో ప్రాణా పాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

కర్నూలు (టౌన్‌): నరసరావుపేటలో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించిన 7వ మాస్టర్స్‌ అంతర్‌ జిల్లాల అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో కర్నూలు మాస్టర్‌ స్విమ్మర్లు పతకాలు సాధించారు. మాస్టర్‌ స్విమ్మర్‌ గఫూర్‌మియ్యా 65–69 సంవత్సరాల విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల ఫ్రీ స్టైల్‌ అలాగే 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు బట్టర్‌ ఫ్లై విభాగంలో 5 బంగారు మెడల్స్‌ సాధించారు. 60 నుంచి 64 సంవత్సరాల వయస్సులో రమణారెడ్డి 400 మీటర్ల ఫ్రీ స్టైయిల్‌లో బంగారు. 100 మీటర్ల ఫుల్‌ స్టైల్‌లో వెండి, 200 మీటర్ల ఫ్రీ స్టైయిల్‌లో కాంస్యం, 50 మీటర్లు, 100 మీటర్లు బ్రెస్ట్‌ స్ట్రోక్‌ విభాగంలో కాంస్యం, అలాగే 35 నుంచి 39 సంవత్సరాల విభాగంలో పి.నాగర్జున 100 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో బంగారు, 100 మీటర్లు, 200 మీటర్లు ఫ్రీ స్టైల్‌లో వెండి, 50 మీటర్లు, 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన మాస్టర్స్‌ స్విమ్మర్లను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ కోచ్‌ నటరాజరావు, అసోసియేషన్‌ అధ్యక్షులు నరసింహా ఆచారి, రామకృష్ణ యాదవ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement