ఎకై ్సజ్ డైరెక్టర్ చేతుల మీదుగా మంగళగిరిలో రాష్ట్రస్థాయి అవార్డులు
అందుకుంటున్న జిల్లా అధికారులు
కర్నూలు: జిల్లా ఎకై ్సజ్ శాఖలో నవోదయం 2.0 అమలు, ఆదాయ పెంపు, నేర నిరోధం వంటి కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించినందుకు గాను ఆ శాఖ జిల్లా అధికారులకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో శనివారం అధికారులు అవార్డులను అందుకున్నారు. కర్నూలు నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ప్రొహిబిషన్ కర్నూలు జిల్లా అధికారి ఎన్.సుధీర్ బాబు మొదటి ప్రాధాన్యత కింద ఆ శాఖ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డులు అందుకున్నారు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డిలు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అలాగే సీఐలు సువర్ణ లత, చంద్రహాస్, జాన్‌సైదులు, లలితాదేవి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ కిషోర్‌కుమార్ తదితరులు కూడా డైరెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.


