● జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి
ఎమ్మిగనూరుటౌన్: జిల్లాలో 45 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకొన్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మెగా ప్లాంటేషన్ డే లో భాగంగా జేసీ నూరల్ ఖమర్, ఆర్డీఓ అరుణదేవిలతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో ఆరు శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందన్నార. విరివిగా మొక్కలు నాటి ఒక శాతం మేర విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. యువత స్వలాభాన్ని వదిలి సమాజానికి తమ వంతు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారిణి తేజశ్వి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ బంగారమ్మ, పట్టణ సీఐ కంబగిరిరాముడు, ఏపీఓ విజయ్‌మోహన్ పాల్గొన్నారు.


