స్వాతంత్య్ర వెలుగులు.. మువ్వన్నెల మెరుపులు | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వెలుగులు.. మువ్వన్నెల మెరుపులు

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

కర్నూలు(సెంట్రల్‌): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగానే రిపబ్లిక్‌ డే నుంచి స్వాతంత్య్ర దినోత్సవం వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఛాయాచిత్రాలతో కూడిన స్టాళ్లు, శకటాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. జిల్లా స్థాయి అధికారి నుంచి అటెండర్‌ వరకు అన్ని స్థాయి క్యాడర్లలో ఉత్తమ పనితీరును ప్రోత్సాహించడం ఆనవాయితీగా వస్తోంది. అవార్డుకు ఎంపికై న అధికారులకు ప్రశంసా పత్రం ఇచ్చి శాలువా కప్పి సన్మానిస్తారు. ఈ ఏడాది 300 నుంచి 400 మంది వరకు ఉద్యోగులు ఉత్తమ పనితీరును కనపర్చినట్లు ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. వీరందరికీ ప్రశంసాపత్రాలను కర్నూలులోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌, ఎస్పీల చేతుల మీదుగా అందజేస్తారు. కాగా, ఇప్పటికే ఎంపికై న ఉద్యోగులకు సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. వీరందరూ ఉదయం 8.30 గంటల్లోపు పరేడ్‌ గ్రౌండ్‌ చేరుకోవాలని అధికారులుపేర్కొన్నారు.

ఇళ్లు, వాణిజ్య సమూదాయాల్లో

జాతీయ పతకాన్ని ఎగుర వేయాలి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇళ్లు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 14, 15 తేదీల్లో కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలు, ప్రధాన ప్రజా ప్రదేశాలు, రైల్వే, బస్‌ స్టేషన్లలో జాతీయ పతాకం రంగుల్లో విద్యుత్‌ అలంకారణ చేపట్టాలని ఆదేశించారు. ఆ మేరకు ఆయా సంస్థలు విద్యుత్‌ వెలుగుల్లో జాతీయభావాన్ని చాటిచెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement