గుణీత్‌ రెడ్డి గురి తప్పలేదు! | - | Sakshi
Sakshi News home page

గుణీత్‌ రెడ్డి గురి తప్పలేదు!

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

వెలుగోడు: రేగడగూడూరు గ్రామానికి చెందిన ఎన్‌. గుణీత్‌ రెడ్డి ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. జిల్లా క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి అమరావతిలో ఎస్‌ఏఏపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు. గుణీత్‌ రెడ్డి ఇప్పటికే 2026 మార్చిలో ఆంధ్రప్రదేశ్‌ తరఫున జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చాటుకున్నాడు. తాజాగా జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. తండ్రి వేణుగోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో గుణీత్‌ రెడ్డి క్రమశిక్షణతో నిరంతరం శిక్షణ పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement