శ్రావణమాసం ప్రారంభంతో పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, గోస్పాడు మండలాలకు చెందిన మహిళలు బంగారు నగల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉంగరం మొదలుకుని అన్ని రకాల నగల కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తున్నారు. తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు పైగా పలుకుతున్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో బంగారు నగల వ్యాపారం బాగుంటుందని ఆశిస్తున్నాం. – పెండేకంటి సుబ్రమణ్యం,
బంగారు నగల వ్యాపారి, కోవెలకుంట్ల


