శుభ ముహూర్తాల శ్రావణం | - | Sakshi
Sakshi News home page

శుభ ముహూర్తాల శ్రావణం

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

కోవెలకుంట్ల: ఈ ఏడాది శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుండటంతో శుభమూర్తాలు రానున్నాయి. జిల్లాలో పలు జంటలు వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచి జీవితాన్ని పంచుకునే శుభ గడియలు దగ్గరయ్యాయి. నెల రోజుల తర్వాత తిరిగి ముహూర్తాలకు మంచి రోజులు రావడంతో ఈ నెల 16వ తేదీ నుంచి కల్యాణ వీణలు మోగనున్నాయి. మాంగల్యం తంతునా.. మమజీవనం హేతునా.. కంఠేభద్మామి సుభగే.. త్వంజీవశరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు మార్మోగనున్నాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పట్టణాలు, పల్లెలు పెళ్లి సందడికి రెడీ అయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో జిల్లాలోని మహానంది, యాగంటి, నయనాలప్ప, అహోబిలం, ఓంకారం, భోగేశ్వరం, శ్రీశైలం, బుగ్గరామేశ్వరం, తదితర పుణ్యక్షేత్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, పంక్షన్‌హాళ్లలో పెళ్లిళ్లు జరుగనున్నాయి.

పల్లెలు, పట్టణాల్లో సందడి

శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి సందడి మొదలైంది. నెల రోజుల విరామం తర్వాత మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. పెళ్లికార్డులు అచ్చువేయించడం, పట్టుచీరలు, వస్త్రాలు, బంగారు నగల కొనుగోలు, తదితర పెళ్లి సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలోని ఆయా పట్టణాల్లో వస్త్ర, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఒక పెళ్లి ఎందరికో ఉపాధి చూపుతోంది. వస్త్ర, బంగారు దుకాణాలతోపాటు పెళ్లి మండపాలు, ట్రావెల్స్‌, పురోహితులు, ఫోటోలు, వీడియో గ్రాఫర్స్‌, సాంస్కృతిక కళాకారులు, క్యాటరింగ్‌, ఎలక్ట్రీషియన్స్‌, బ్యాండుమేళం, పూలఅంగళ్లు, ఇలా ఎందరికో చేతి నిండా పని దొరుకుతోంది. ఆయా ముహూర్తాల్లో వివిధ కేటగిరీలకు చెందిన వారికి ఉపాధి దొరుకనుండటంతో వారంతా సంబర పడుతున్నారు.

రెండు నెలల్లో మంచి ముహూర్తాలు

ఈ నెల 13వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా పరాభవనామ సంవత్సర శ్రావణ మాసం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దాదాపు ఈ రెండు నెలల్లో 20 శుభ ముహూర్తాలు ఉన్నాయి. నెల రోజుల బ్రేక్‌ తర్వాత తిరిగి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో పెళ్లిభాజాలు మోగనున్నాయి. ఈ నెలలో 14, 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో, వచ్చే నెల 3, 4, 5, 8, 10, 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని వేద పండితులు చెబుతున్నారు.

రేపటి నుంచి

శ్రావణ మాసం ప్రారంభం

ఆగస్టు, సెప్టెంబర్‌లో

మంచి ముహూర్తాలు

కిటకిటలాడుతున్న వస్త్ర, జ్యువెలరీ

దుకాణాలు

ఒక పెళ్లి.. ఎందరికో ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement