ఎమ్మిగనూరులో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరులో చోరీ

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

40 తులాలు వెండి,

రూ.20 వేలు నగదు అపహరణ

కుటుంబం తీర్థయాత్రలకు వెళ్లడంతో

దొంగల చేతివాటం

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని లక్ష్మీపేటలో రమేష్‌ అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలు.. లక్ష్మీపేటకు చెందిన బజ్జిల వ్యాపారి రమేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల క్రితం అరుణాచలం, తిరుపతితో పాటు తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తలుపులకు లాక్‌ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉంచిన రూ.20 వేల నగదు, 40 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. తీర్థయాత్రల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న రమేష్‌ కుటుంబ సభ్యులు గేటు తాళం తీసి లోపలికి వెళ్లగా డోర్‌ లాక్‌ తీసి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కంబగిరి రాముడు, ఏఎస్‌ఐ కిష్టప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పట్టణ పోలీసుల తెలిపారు.

గడ్డివాముల దగ్ధం

సుమారు రూ.3 లక్షలు నష్టం

దొర్నిపాడు: మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో మంగళవారం గడ్డివాములకు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మద్దుబైగారి హుసేన్‌బాషాకు చెందిన మూడు గడ్డివాములు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. వెంటనే ఆళ్లగడ్డ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు కాలిపోయిన గడ్డివాములను పరిశీలించారు. కాడెద్దులు, గేదెలకు నోటికాడి మేత లేకుండా పోయిందని ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయంతో పాటు పశుగ్రాసం అందించాలని బాధితుడు కోరారు. సుమారు రూ.3 లక్షలు వెచ్చించి చొప్ప, వరిగడ్డితో వాములు వేసుకున్నట్లు చెప్పారు. అగ్నిమాపక కేంద్రం అధికారి భీముడునాయక్‌, ఎల్‌ఎఫ్‌ మనోహర్‌రెడ్డి, సిబ్బంది రమణయ్య, గుర్రప్ప ఉన్నారు.

వాటర్‌ గ్రిడ్‌ పైప్‌ లీకేజీ

బేతంచెర్ల: ఆర్‌ కొత్తపల్లె గ్రామ సమీపంలో మంగళవారం గోరుకల్లు వాటర్‌ గ్రిడ్‌ మెయిన్‌ పైపులైన్‌ పగిలి నీరు వృఽథాగా పోతోంది. బేతంచెర్ల నుంచి డోన్‌ వైపు వెళ్తున్న ప్రధాన పైపులైను పగిలి నీరు ఎగసిపడుతోంది. వాటర్‌ గ్రిడ్‌ అధికారులు స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి విలువైన నీరు నేలపాలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement