ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

కర్నూలు: కర్నూలు మండలం పంచలింగాల గ్రామ శివారులోని జిల్లా జైలును న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు మంగళవారం లీలా వెంకటశేషాద్రి జిల్లా జైలుకు చేరుకుని జైల్‌ ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌, ములాఖత్‌ ఏరియాలోని హెల్ప్‌డెస్క్‌ను తనిఖీ చేసి జైలు ఖైదీలకు ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్స్‌ గురించి వివరించారు. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధ పడేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, త్వరగా బెయిల్‌ మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జైలు అధికారులు, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్‌ కౌన్సిల్‌ శివరామచంద్రరావు, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సులోచన, ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ న్యాయవాది చిన్నరామదాసు, పారా లీగల్‌ వాలంటీర్‌ హేమంత్‌ శివాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement