ఖరీఫ్ సీజన్‌లో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగుచేసిన రైతన్నలను ఎల్‌నినో ప్రభావంతో కష్టాల పాలుచేసింది. గత జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలకు సాగు చేసిన పంటలు ఆ తర్వాత వానల్లేక గిడసబారిపోతున్నాయి. దీంతో పంటలను దున్నేయడం, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామానికి చెందిన జయభారతిరెడ్డికి నాలుగు ఎకరాల మెట్ట పొలంలో ముంగారి పత్తిని సాగుచేశారు. దీంతో విత్తు మొలక దశలోనే ఉండడంతో గొర్రెలకు మేతగా వదిలేశారు. అలాగే కొత్తపల్లి మండలం సింగరాజుపల్లెలో సూగూరు నారాయణ మూడు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నను జీవాలకు మేతగా వదిలేశాడు. ఇప్పటివరకు విత్తనాలు, దుక్కులు, ఎరువులు, కూలీలు అన్ని కలుపుకొని రూ.90 వేలుదాక ఖర్చుచేశానని మొత్తం నేపాలు అయిందని ఆవేదన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి దృశ్యాలు ప్రతి పల్లెల్లో కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. – ఆలూరు/కొత్తపల్లి


