సర్‌లో 2,73,587 మంది ఓటర్ల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

సర్‌లో 2,73,587 మంది ఓటర్ల తొలగింపు

Aug 1 2026 12:22 AM | Updated on Aug 1 2026 12:22 AM

పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

జిల్లాలోని ఓటర్ల వివరాలు

పేరు స్టేషన్ల ఓటర్లు ఓటర్లు ఓటర్లు ఓటర్లు

సంఖ్య

సర్‌లో తొలగించిన

ఓటర్ల సంఖ్య 2,73,587

అత్యధికంగా పాణ్యంలో

2,83,030 మంది ఓటర్లు

అత్యల్పంగా మంత్రాలయంలో

1,97,152 మంది

ముసాయిదా జాబితా విడుదల చేసిన

ఎన్నికల సంఘం

అభ్యంతరాలకు

ఆగస్టు 30వ తేదీ వరకు గడువు

అక్టోబర్‌ 3న తుది

ఓటరు జాబితా విడుదల

కర్నూలు(సెంట్రల్‌): స్పెషల్‌ ఇన్సెంటివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌(బీఎల్‌ఓ)ల ఇంటింటి సర్వే పూర్తి కావడంతో జిల్లా ఎన్నికల సంఘం ముసాయిదా జాబితా విడుదల చేసింది. ఆ ప్రకారం జిల్లాలో 18,14,128 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,93,162 మంది కాగా.. మహిళలు 9,19,105.. ఇతరులు 264, సర్వీసు ఓటర్లు 1,596 మంది ఉన్నారు. కాగా, పురుష ఓటర్ల కంటే 25,944 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అత్యధికంగా పాణ్యంలో 2,83,030 మంది ఓటర్లు, అత్యల్పంగా మంత్రాలయంలో 1,97,152 మంది ఓటర్లు ఉన్నారు.

ఆలూరు తప్ప అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం

ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఆలూరులో 1,19,008 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,18,259 మంది ఉన్నారు. ఇక జిల్లా మొత్తంగా మహిళా ఓటర్లు 9,19,105 మంది ఉండగా పురుష ఓటర్లు 8,93,162 మంది, ఇతరులు 265 మంది ఉన్నారు. ఇతరుల్లో అత్యధికంగా పాణ్యంలో 63 మంది, అత్యల్పంగా కర్నూలులో 18 మంది ఉన్నారు.

కర్నూలు, పాణ్యం, ఆదోనిలోనే

ఎక్కువ ఓటర్ల తొలగింపు?

కర్నూలు, పాణ్యం, ఆదోని నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తొలగింపులు ఉన్నాయి. కర్నూలులో మొత్తం ఓటర్లు 2,74,622 మందిలో 67,755 మంది, పాణ్యంలోని 3,35,015 మందిలో 51,985 మంది, ఆదోనిలోని 2,67,980 మందిలో 34,946 మంది ఓటర్లను తొలగించారు. ఇందులో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 16 వార్డుల్లోనే తొలగించిన జాబితా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. దీనిని బట్టి కర్నూలు నగరంలోని ఓటర్ల వివరాలు ఎక్కువగా గల్లంతయ్యాయని తెలుస్తోంది.

తొలగింపుల్లో అర్హులు ఉంటే

ఏమి చేయాలి

సర్‌లో భాగంగా జిల్లాలో తొలగించిన ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లు ఉంటే ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వీరంతా త్వరలోనే జరిగే స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో ఫాం–6 ఇచ్చి మళ్లీ ఓటును పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే వారి ఓటు శాశ్వతంగా తొలగిపోతుంది.

పెరిగిన 249 పోలింగ్‌ బూత్‌లు

జిల్లాలో సర్‌లో భాగంగా పోలింగ్‌ బూత్‌ల విభజన కూడా జరిగింది. 2024 ఎన్నికల ప్రకారం జిల్లాలో 2203 పోలింగ్‌ బూత్‌లు ఉండేవి. ఈ క్రమంలో ప్రతి బూత్‌లో 1,200 ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా బూత్‌ల పరిధిని కుదించారు. గతంలో 1,500 పైగా కూడా ఒక్కో బూత్‌లో ఓటు వేసే వారు. అయితే ఆ సంఖ్య ను 1,200లకు కుదించడంతో జిల్లాలో భారీగా పోలింగ్‌ బూత్‌లు పెరిగాయి. ఆ సంఖ్య 2,203 నుంచి 2,452కు పెరిగింది. మొత్తంగా జిల్లాలో సర్‌ తరువాత 249 పోలింగ్‌ బూతులు పెరిగాయి.

నియోజకవర్గం పోలింగ్‌ పురుష మహిళా ఇతరులు సర్వీస్‌ మొత్తం

కర్నూలు 318 99820 107029 18 79 206946

పాణ్యం 373 137835 145132 63 277 283307

పత్తికొండ 277 103259 103578 22 449 207308

కోడుమూరు 291 112792 113772 12 177 226753

ఎమ్మిగనూరు 322 109503 112167 31 187 221888

మంత్రాలయం 267 96405 100719 28 57 197209

ఆదోని 284 114540 118449 45 108 233142

ఆలూరు 320 119008 118259 46 262 237575

మొత్తం 2452 893162 919105 265 1596 1814128

ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

జిల్లాలో సంచలనం సృష్టించిన సర్‌–2026 సర్వేలో ఏకంగా 2,73,587 మంది ఓటర్లను తొలగించారు.

జూన్‌ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటా సర్వే నిర్వహించి సేకరించిన జాబితాల ఆధారంగా ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది.

ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఈ జాబితాపై ఆగస్టు 30వ తేదీ వరకు సలహాలు, సూచనలు, ఫిర్యాదులను స్వీకరిస్తుంది.

కాగా, ముసాయిదా జాబితాలను అన్ని పోలింగ్‌ బూత్‌ల వారీగా అందుబాటులో ఉంచుతారు.

అదేవిధంగా తహసీల్దార్‌, ఆర్‌డీఓ, కలెక్టరేట్‌లోనూ తొలగించిన జాబితాలు, సర్‌ సర్వే జాబితాలు అందుబాటులో ఉంటాయి.

ఆ జాబితాల ఆధారంగా ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై ఆగస్టు 30వ తేదీ వరకు పరిశీలన చేసి సెప్టెంబర్‌ 28వ తేదీలోపు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తారు.

అక్టోబర్‌ 3వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాలో మొత్తం 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. సర్‌లో భాగంగా బీఎల్‌ఓలు 2026 జూన్‌ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటా సర్వేకు శ్రీకారం చుట్టారు. 2025 ఓటరు జాబితాను 2002 సర్‌ జాబితా ఆధారంగా పోల్చి చూశారు. ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు ఇచ్చి సేకరించారు. మొత్తం 20,86,119 మంది ఓటర్లలో 18,12,532 మంది ఓటర్లే తమ ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను తిరిగి సమర్పించారు. దీంతో ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను సమర్పించని 2,73,587 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement