రైతుల కష్టం వర్షార్పణం | - | Sakshi
Sakshi News home page

రైతుల కష్టం వర్షార్పణం

Jul 20 2026 1:38 AM | Updated on Jul 20 2026 1:38 AM

ఎమ్మిగనూరుటౌన్‌: వేరుశనగ దిగుబడులు ఆదివారం కురిసిన వర్షానికి తడిచి పోయాయి. ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులో షెడ్లు లేకపోవడంతో పంట ఉత్పత్తులకు రక్షణ లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజవర్గాల్లోని గ్రామాల నుంచి 15,757 బస్తాల్లో 4,727 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను ఆదివారం విక్రయానికి తీసుకొచ్చారు. క్వింటా గరిష్టంగా రూ.8,540 ప్రకారం కొనుగోలు చేశారు. వర్షం కురవడంతో రైతులు ఆరబోసుకున్న పంట దిగుబడులు పూర్తిగా తడిసిపోయాయి.వర్షం వచ్చి డ్రైన్‌ నీరు వెనక్కు వచ్చి నీటిలో తన 12 సంచులకు పైగా నీట మునిగి కొట్టుకొనిపోయాయని రైతు కర్ణ కన్నీటి పర్యంతమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement