వర్షాల్లేవు.. వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి.. రైతులందరూ తీవ్ర నష్టాల్లో ఉన్నారు.. అయినా ఆస్పరి మండలం యాటకల్లు గ్రామానికి చెందిన రైతు కురువ రాముడు వెనుకడుగు వేయలేదు. కుటుంబ సభ్యులతో కలసి తన పొలంలో శనివారం టమాట మొక్కలను నాటారు. గడ్డపారతో లోతైన గుంతలను తవ్వి నారును నాటి బిందెలతో నీరు పోశారు. తమకు వ్యవసాయమే జీవనాధారమని, మూటాముల్లె సర్దుకొని వలస వెళ్లలేమని, దేవునిపై నమ్మకంతోనే టమాట మొక్కలను నాటినట్లు రైతు కురువ రాముడు చెప్పారు.
– ఆలూరు


