గ్రామీణ అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించాలి

Jul 17 2026 3:28 AM | Updated on Jul 17 2026 3:28 AM

గ్రామీణ అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించాలి

పాణ్యం: గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలని, ప్రజా అవసరాలకు సంబధించి అజెండాను తయారు చేసుకోవాలని జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి గ్రామీణ కార్యదర్శులకు సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ కార్యదర్శలకు జీపీడీపీపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల మౌళిక సదుపాయాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామ కార్యదర్శి ఒక అజెండాను తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే ప్రజా సమస్యల్లో ప్రాధాన్యత వాటిని పరిష్కరించాలని, ప్రధానంగా వైద్యం, తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం తదితర వాటిపై దృష్టి సారించాలన్నారు. ప్రతి గ్రామంలో వర్మీ యూనిట్‌ నిర్వహణ మెరుగుపరిచి సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు. అనంతరం పాణ్యం పంచాయతీ పరిధిలో ఉన్న వర్మియూనిట్‌ను పరిశీలించి తడి, పొడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ ఉసేన్‌బీ, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.

జెడ్పీ సీఈఓ

సుధాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement