కర్నూలు: విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకు జిల్లా అంతటా వాహన తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. కర్నూలు నగరంలో రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బ్లూ కోల్ట్స్, క్యూఆర్టీ పోలీస్ బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహించారు. రహదారి ప్రమాదాల నివారణకు స్టాప్ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


