తుగ్గలి: వ్యవసాయంలో రోజురోజుకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. కాడెద్దుల పోషణ భారమైంది. పొలంలో ఏ పని చేయాలన్నా వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అంత ఖర్చు భరించలేని మండలంలోని కడమకంట్ల రైతు తిమ్మన్న ఖర్చు తగ్గించుకోవడానికి సైకిల్ చక్రంతో గుంటెక తయారు చేయించుకున్నారు. దాంతో తాను మూడెకరాలలో సాగు చేసిన టమాట పంటలో భార్య భాగ్యమ్మతో కలిసి కలుపుతీశారు. దీని తయారీకి రూ.3వేలు ఖర్చయిందన్నారు. లక్షలు ఖర్చుపెట్టి కాడెద్దులు కొనుగోలు చేసి వ్యవసాయం చేసే పరిస్థితి లేదన్నారు.


