అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

కర్నూలు: అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దూపాడులోని అశోక ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో సైబర్‌ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు పెరిగిపోయాయని, విద్యావంతులు, విద్యార్థులను కూడా సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారన్నారు. వాటిని ఎలా ఎదుర్కొని బయటపడాలో అవగాహన కల్పించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ విశాల్‌.. మనీ సంబంధిత ఆన్‌లైన్‌ మోసాల గురించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. కర్నూలు సైబర్‌ ల్యాబ్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరం జరిగినప్పుడు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్‌ క్రైమ్స్‌పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కర్నూలు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మెల్విన్‌ జోన్స్‌ సంస్థ ప్రతినిధి రాయపాటి శ్రీనివాస్‌ సహకారంతో సర్టిఫికెట్లను అందజేశారు. హెచ్‌ఓడీ జావెద్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ రవిశంకర్‌, బీఎం మహమ్మద్‌ గౌస్‌, డిప్యూటీ మేనేజర్‌ జయరాంతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement