కర్నూలు: కర్నూలు చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎం.శివరామచంద్రరావు నియమితులయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. శుక్రవారం ఉదయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆర్థిక స్తోమతలేని నిందితులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసేవల్లో భాగంగా క్రిమినల్ కేసుల్లో నిందితుల తరఫున వాదనలు వినిపిస్తారు. గడచిన రెండు సంవత్పరాల నుంచి డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా పనిచేసి పలు కేసుల్లో తన వాదనలు వినిపించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టువారు ఇచ్చిన నోటిఫికేషన్‌లో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా ధరఖాస్తు చేసుకోవడంతో శివరామచంద్రరావును ఎంపిక చేసి నియమించారు.


