కోవెలకుంట్ల: పట్టణ శివారులో ప్రవహిస్తున్న కుందూనదిలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంత య్యాడు. కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న మన్నెపు రవికుమార్(40) గడేకారిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మద్యం సే వించి ఇదే పట్టణానికి చెందిన నరసింహరాజు అనే మరో గడేకారితో కలిసి గౌండా పనికి బయలుదేరారు. కుందూనది వద్దకు వెళ్లగా ఈత కొట్టాలని భావించి ఇద్దరు నదిలో దిగారు. ఆ ప్రాంతం లోతుగా ఉండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రవికుమార్ ప్రమాదవ శాత్తూ నీటిలో గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఒడ్డుకు చేరుకుని గట్టిగా కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకునే లోపే రవికుమార్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో కుందూనదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఆలూరు రూరల్: విద్యుత్ షాక్‌తో మండలంలోని అరికెర గ్రామానికి చెందిన మస్తాన్ వలి (43) మృత్యువాత పడ్డాడు. శనివారం మధ్యాహ్నం అరికెర గ్రామంలో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాలు.. మస్తాన్ వలి గ్రామంలో జీవనోపాధి కోసం షాపు నిర్మించుకుంటున్నాడు. ఇందులో భాగంగా శనివారం నిర్మాణంలో ఉన్న షాపునకు బోరు వేసి క్యూరింగ్ చేస్తుండగా మోటర్ పైపు ఊడి పోయింది. మోటర్‌కు పైపు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రమిజాబీ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
జామ చెట్లు బుగ్గిపాలు
వెల్దుర్తి: రెండేళ్లకు పైగా ఆరుగాలం కష్టపడి సాగు చేసిన జామ చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మండల పరిధిలోని సూదేపల్లె గ్రామానికి చెందిన రైతు మాదిగ పెద్ద మాదన్నకు చెందిన అదే గ్రామ రెవెన్యూ పరిధిలోని తోటలో జామ చెట్లు సాగు చేస్తున్నాడు. శనివారం తోటకు వెళ్లిన రైతుకు దాదాపు చెట్లకు మంటలు వ్యాపించి తగులబ డుతుంటం కనిపించింది. చుట్టు పక్కల రైతులు, కుటుంబ సభ్యులతో కలిసి మంటలను ఆర్పివేశారు. అప్పటికే దాదాపు 200 చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రెండేళ్ల క్రితం ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రెండున్నర ఎకరాలలో 300 జామ చెట్లను నాటాడు. ప్రస్తుతం మంచి కాపులో ఉన్న చెట్లు కాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. గుర్తుతెలియని దుండగులు పంట దిగుబడిపై కంటగింపుతో అగ్గిరాజేసి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. రైతు కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిన సంఘటనపై, నిస్సహాయ స్థితిలోని రైతుకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
పత్తికొండ రూరల్: పత్తికొండ–రాతన రహదారిలో ఓ మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాతన గ్రామానికి చెందిన మెడికల్ ఏజెన్సీ ఉద్యోగి కురుగోడు సతీష్ (30) మృతి చెందాడు. శనివారం ఉద యం బస్సులో వెళ్లి భార్య, పిల్లలను బళ్లారిలో వదిలేసి పత్తికొండకు వచ్చి పని ముగించుకున్నాడు. పత్తికొండ నుంచి తుగ్గలి మండలం రాతన గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా మలుపు దగ్గర ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య కల్పన, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.
ఇద్దరికి ప్రశస్తి అవార్డులు
మంత్రాలయం: శ్రీమఠం పూర్వ పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల 13వ ఆరాధనోత్సవాలు వైభ వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శని వారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో డోలోత్సవ మండపంలో ఇద్దరికి ప్రశస్తి అవార్డులను అందజేశారు. కర్నూలు జిల్లా ఆడిట్ అధికారి కె.రమేష్‌బాబు, బెంగళూరుకు చెందిన ఎయిర్‌స్పేస్ సైన్స్ రంగం సీనియర్ ప్రొఫెసర్, చైర్మన్ జి.జగదీష్ గోపాలన్‌కు పీఠాధిపతి అవార్డులను ప్రదానం చేశారు.


