● కేజీబీవీల్లోకి పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధం, ఉపాధ్యాయులు (టీజీటీ /పీజీటీలు) సైతం మహిళలే.
● అలాగే ప్రతి పాఠశాలకు ప్రహరీ, గేటు, వాచ్‌మెన్‌తో కూడిన రక్షణ, భద్రత ఉంటుంది.
● అధికారులు తనిఖీలు, పరిశీలన నిమిత్తం తప్పిస్తే ఇతరులకు వెళ్లేందుకు ప్రవేశం ఉండదు.
● ఎటువంటి ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలతో కేజీబీవీల్లో సీట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది.
● వైఎస్సార్‌సీపీ హయాంలో మన బడి నాడు–నేడు ద్వారా కేజీబీవీలను సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులు, మౌలిక సదుపాయాలకు తోడు ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను మరింత చేరువ చేశారు.
● మోనూ, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, కాస్మోటిక్స్ అందిస్తున్నారు.
● ప్రభుత్వం అందించాల్సిన తల్లికి వందనం, విద్యాకానుక పథకాలకు వీరంతా అర్హులే.


