మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథస్వామి రథోత్సవం శనివారం అశేష భక్తజనవాహిని మధ నిర్వహించారు. ఉదయం రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవికి అర్చకులు రంగస్వామి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయంలో గోవింద నామస్మరణ హోరెత్తింది. సాయంత్రం సతీసమేత ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి అశేష భక్తజన వాహిని మధ్య మహా రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఈఓ రెబ్బ వీరయ్య, ఆలయ చైర్మన్ రవి, సర్పంచు మల్లికార్జున, తహసీల్దారు గుండాల నాయక్, దాతలు పారా రామచంద్ర ప్రసాద్, పారా విశ్వనాథ్, మాజీ జెడ్పీటీసీ పురుషోత్తం చౌదరి, రామలింగారెడ్డి, ఉప సర్పంచు గోపాల్, మాజీ ఆలయ చైర్మన్ దస్తగిరిగౌడు తదితర ప్రముఖులు రథోత్సవంలో పాల్గొన్నారు.


