నాటుసారాను సమూలంగా నిర్మూలించాలి
క్షేత్రస్థాయి అధికారులకు
కర్నూలు : జిల్లాలో నాటుసారా ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నవోదయం 2.0లో భాగంగా నాటుసారా నిర్మూలన చేసిన గ్రామాల్లో సారా పునరుత్పత్తి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు సుధీర్ బాబు, రవికుమార్‌లతో కలసి కర్నూలులోని ఎకై ్సజ్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అధికారులతో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 141, నంద్యాల జిల్లాలో 129 నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి నవోదయం 2.0 అమలులో భాగంగా ఆయా గ్రామాల్లో నిర్మూలించినప్పటికీ పునరుత్పత్తి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎకై ్సజ్ పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేసిన వెంటనే చార్జ్‌షీట్లు వేయకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని సీఐలకు హెచ్చరించారు.
పర్మిట్ రూముల లైసెన్స్‌లు
జారీ పూర్తి చేయండి...
మద్యం షాపులకు అనుబంధంగా వ్యాపారులు లైసెన్స్ తీసుకోకుండానే పర్మిట్ రూములు నడుపుతున్నారని స్టేషన్ల వారీగా వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్ జారీ ప్రక్రియ పూర్తి చేసి ఈఎస్‌లకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి వచ్చే అవకాశమున్నందున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రైడ్స్ నిర్వహించాలన్నారు. నాటుసారా తయారీ, వ్యాపారం మానుకున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి, అక్రమ మద్యం అరికట్టడం, అనధికారిక మద్యాన్ని నిర్మూలించడం, సురక్ష యాప్ ద్వారా స్కానింగ్, ఎకై ్సజ్ యాప్ ద్వారా పర్యవేక్షణ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రాముడు, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ గౌడ్‌తో పాటు అన్ని స్టేషన్ల సీఐలు సమీక్షలో పాల్గొన్నారు.
ఎకై ్సజ్ నోడల్ డీసీ ఆదేశం


