వామ్మో చిరుత
రోడ్డు పక్కన ఉన్న చిరుత
కొలిమిగుండ్ల: కోర్నపల్లె సమీపంలోని గుండం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఆదానీ సిమెంట్ మైనింగ్ పరిసరాల వద్ద గురువారం తెల్లవారు జామున చిరుత కనిపించింది. సిమెంట్ ఫ్యాక్టరీలో ముగ్గురు ఉద్యోగులు డ్యూటీ ముగించుకొని కారులో తిమ్మనాయినిపేటకు వెళ్తున్న సమయంలో మైనింగ్ పరిసరాల్లోకి చేరుకొనే సరికి రోడ్డును క్రాస్ చేయడా న్ని గమనించారు. కారు లైటింగ్‌కు కొద్ది సేపు చిరుత ఆగడంతో అందులో ఉన్న సిబ్బంది సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశారు. దెయ్యాల చెరువు వైపు చిరుత వెళ్లిపోవడాన్ని గమనించారు. చిరుత సంచారం విషయం తెలియడంతో అబ్దులాపురం, కోర్నపల్లె గ్రామాల రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లరాదని ఫ్యాక్టరీ సిబ్బంది సూచించారు. మరో వైపు అనంతపురం జిల్లా తాడిపత్రి అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రదేశాన్ని తిలకించి పాద ముద్రలు సేకరించారు. దాదాపు ఏడు నెలల క్రితం తిమ్మనాయినిపేట సమీపంలో చిరుత దారిన పోయే వాహనదారులకు కనిపించింది. ఇప్పుడు కోర్నపల్లె కనిపించిన చిరుత రెండు ఒక్కటే ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


