కాటసాని శివ దీక్ష స్వీకరణ
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి క్షేత్రంలో గురువారం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శివదీక్ష స్వీకరించారు. కాటసాని ఈ దీక్ష స్వీకరించడం 35వ సారి కావడం విశేషం. శివదీక్ష సందర్భంగా కాటసానితో పాటు ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి ఆలయంలోని ఉమామహేశ్వరులను దర్శించుకున్నారు. నందీశ్వరుడికి కూడా పూజలు నిర్వహించారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు సుమారు 200 మంది శివదీక్ష స్వీకరించారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


