ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
డోన్ టౌన్: ఉడుములపాడు సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి వైపు నుంచి డోన్‌కు వస్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సూదేపల్లెకు చెందిన జానకిరామ్, అమకతాడుకు చెందిన రమేష్ నాయుడులకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వారిని చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జానకిరామ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


