ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరు మృతి
● ఇద్దరికి గాయాలు
ఆస్పరి: నాపరాళ్లలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఆస్పరి మండలం బిణిగేరి సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బనగానపల్లె నుంచి ఆదోనికి నాపరాళ్ల లోడుతో ఆదోనికి వెళ్తున్న ట్రాక్టర్‌ను బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్స బిణిగేరి సమీపంలో వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడి అందులో ఉన్న బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన ముద్దవరం చిన్న మద్దిలేటి (35) అక్కడకక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నాగేశ్వరరావు, కూలీ లక్ష్మీ నరసింహ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బిణిగేరి గ్రామస్తులు అక్కడికి చేరుకుని నాపరాళ్ల కింద పడిన ఇద్దరిని బయటకు తీసి ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరు మృతి


