అహోబిలం మఠం అర్చకుడి మృతి
దొర్నిపాడు: ప్రముఖ పుణ్యక్షేత్రం అహో బిలం మఠం అర్చకు లు కిడాంబి లక్ష్మీనరసింహ చార్య (63) ఆదివారం చైన్నెలో గుండెపోటుతో మృతి చెందారు. ఎగువ అహోబిలంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు, పతిత్రోత్సవాల్లో అర్చకులుగా ఈయన వ్యవహరించేవారు. మఠం పీఠాధిపతి, అర్చకులు, సిబ్బంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
విద్యార్థి అదృశ్యం
మద్దికెర: స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి లక్ష్మీ కాంత్ శనివారం అదృశ్యమయ్యాడు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం ఇంటికి వచ్చి పుస్తకాలు ఉంచి స్నేహితుల ఇంటి వద్ద చదువుకుంటానని చెప్పి వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు సురేంద్ర, మీనా ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ అభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.
గుర్తు తెలియని శవం లభ్యం
కోడుమూరు రూరల్: గూడూరు సమీపంలోని పొలాల్లో ఆదివారం సాయంత్రం 40 సంవత్సరాలు పైబడిన ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తు పట్టలేని విధంగా మారి దుర్వాసన వస్తోంది. కాగా చనిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవ్వరైనా చంపి పడవేశారా అన్న కోణంలో గూడూరు ఎస్‌ఐ రాజ కుళ్లాయప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దూది పరుపుల గోదాములో అగ్ని ప్రమాదం
● రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఆదోని బైపాస్ రోడ్డు ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న దూది పరుపులు తయారు చేసే గోదాములో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. మంటలను గమనించి యజమాని దూదిపరుపుల బాషా, చుట్టు పక్కల వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.వీలుకాకపోవడంతో అగ్ని మాపక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే మంటల్లో దూది పరుపులు తయారు చేసేందుకు నిల్వ ఉంచిన దూది మొత్తం కాలిబూడిద కావడంతో రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
అండర్–14 క్రికెట్ ఎంపిక పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోక్రాంతినగర్‌లోని సబ్ సెంటర్‌లో అండర్–14 బాలుర క్రికెట్ లీగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 90 మంది హాజరైనట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోవిందరెడ్డి, దేవేంద్రగౌడ్, అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ రమేష్‌బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అహోబిలం మఠం అర్చకుడి మృతి
అహోబిలం మఠం అర్చకుడి మృతి


