క్రికెట్ మ్యాచ్ గెలిచి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ● మరొకరికి గాయాలు
ఎమ్మిగనూరురూరల్: క్రికెట్ మ్యాచ్ గెలి చి ఆదోనికి తిరిగి వెళ్తుండగా ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాల కృష్ణ(34) అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యా యి. ఆదోని పట్టణం నారాయణపురం గుంత కాలనీకి చెందిన బాలకృష్ణ(34) స్నేహితులతో కలసి ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా వీవర్స్ కాలనీలో జరుగుతున్న క్రికెట్ పోటీలకు వెళ్లారు. సచిన్ లెవెన్ క్రికెట్ టీమ్ మ్యాచ్ అడి గెలు పొందారు. రాత్రి ఎమ్మిగనూరు నుంచి బైక్‌పై బాలకృష్ణ(34), వెంకటేష్ వెళ్తున్నారు. బనవాసి పారం సమీపంలోని స్మార్ట్ సిటీ ఎదరుగా ఉండే రోడ్డు దగ్గర డివైండర్‌ను ఢీ కొట్టడంతో డ్రైవింగ్‌లో ఉన్న బాలకృష్ణ(34) తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న వెంకటేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి. బాలకృష్ణ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గాయపడ్డ యువకుడిని చికిత్సనిమిత్తం ఆదోనికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ పోలీసులు రాత్రి తెలిపారు.
సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
నంద్యాల (వ్యవసాయం): హిందువులంతా ఐక్యంగా ఉండి సనాతన ధర్మా న్ని కాపాడుకోవాలని శ్రీశైలం దత్త పీఠాధిపతి రుద్ర శివానంద సరస్వతి స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం కోటా వీధి లోని బ్రహ్మానందీశ్వర ఆలయ ఆవరణలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. భారత మాత చిత్రపటానికి, శివాజీ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ సభలో వక్తలు మాట్లాడుతూ అన్ని మతాలు, ప్రాంతాల ప్రజలు బాగుండాలని కోరుకునే ఏకై క దేశం మనదేనన్నారు. ఈ సమ్మేళనంలో మాకాం శేషఫణి, ఆరవీటి శ్రీనివాసులు, వాసగిరి కృష్ణ లింగయ్య, అరుణ, శిరీష, శంకర్ పాల్గొన్నారు.
క్రికెట్ మ్యాచ్ గెలిచి వెళ్తూ..


