గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని పోటీ ల్లో రాణించాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బసవరావు, రిజిస్టార్ విజయకుమార్ నా యుడు అన్నారు. నంద్యాల పట్టణంలోని పీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరు గుతున్న రాయలసీమ యూనివర్సిటీ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆయా పోటీల్లో విజేతలకు రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బసవరావు, రిజిస్టర్ విజయ్‌కుమార్‌నాయు డు, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ శివకిశోర్, ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళలు అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని నంద్యాలలో నిర్వహించిన ఈ పోటీలకు 17 కళాశాలలు పాల్గొన్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు.
విజేతల వివరాలు..
పురుషులు
వంద మీటర్ల పరుగులో పోటీలో జోసెఫ్ (శ్రీలక్ష్మీ బీపీడీ కాలేజీ), మంజునాథ్ (ఉస్మానియా), దీవెన కుమార్ (ఉస్మానియా)
● 200 మీటర్ల పరుగు పోటీలో మహేష్ (సెయింట్ జోసెఫ్), జోసెఫ్ (ఉస్మానియా), జీవన్ కుమార్ (ఉస్మానియా)
● 400 మీటర్ల పరుగు పోటీలో పరుశు రాముడు (ఉస్మానియా), ఉపేంద్ర (ఉస్మానియా), రంగస్వామి (నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల)
● 1500 మీటర్లు పరుగు పోటీలో శివలింగప్ప, బషీర్, ఉపేంద్ర (ప్రభుత్వ డిగ్రీ కళాశాల)
మహిళలు..
● 1500 మీటర్లు పరుగు పందెంలో ప్రసన్న (నంద్యాల ప్రభుత్వ కళాశాల), మానస, తేజస్వని (సెయింట్ జోసెఫ్)
షాట్‌పుట్‌లో: కీర్తన, జయశ్రీ ( ప్రభుత్వ కళాశాల)
డిస్కస్‌త్రోలో.. ప్రసన్న, మహేశ్వరి (నంద్యాల ప్రభుత్వ కళాశాల)


