పేదల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటం
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం ● మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ: వైద్య సేవలను దూరం చేస్తూ చంద్రబాబు సర్కారు పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని తేరుబజార్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పేదల ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అట్టడుగు వర్గాల విద్యార్థులు మెడికల్ విద్యనభ్యసించేలా గత ప్రభుత్వంలో జగనన్న 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో 5 కాలేజీలను ప్రారంభించడంతో, మరికొన్ని కాలేజీలు దాదాపు 50 నుంచి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటి నిర్మాణాలు పూర్తి చేయకుండా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణకు యత్నించడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తున్నా చంద్రబాబు సర్కారకు చీమకుట్టినట్లుగాల లేదని విమర్శించారు. 18 నెలల కాలంలో రూ.2.50 లక్షలు కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు పేదలకు ఏమి చేశారని మండిపడ్డారు. అప్పుల్లో కనీసం 5వేలు కోట్లు కేటాయిస్తే చాలు 11 మెడికల్ కాలేజీలు పూర్తయి పేదలకు అందుబాటులోకి వచ్చేవన్నారు. ఇప్పటికే పేదవాడి సంజీవినిగా పేరుగాంచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రస్టుపట్టించారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్‌దాస్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక, జిల్లా ఎస్టీ సెల్ సంఘం అధ్యక్షుడు భాస్కర్‌నాయక్, మండల కన్వీనర్ కారం నాగరాజు, నాయకులు టీఎండీ హుశేన్, లలితా రామచంద్ర, శ్రీకాంత్‌రెడ్డి, నరసింహరెడ్డి, సాబ్డిన్ నూర్‌బాషా, కొమ్ము నెట్టేకల్ కారుమంచి నజీర్, దేవన్న, వార్డు మెంబర్లు లింగన్న, రంగన్న , కొండగేరి శివ, మస్తాన్, మహహ్మద్, రామాంజినేయులు నాయకులు గణపతి, తిమ్మరాజు, బండల వలి కరవాల హుశేన్, హనిఫ్, షరీఫ్, మస్తాన్, ఇమ్రాన్, నవీన్, మునిస్వామి బబ్లూ, జిలాన్, ముగ్బుల్ తదితరులు పాల్గొన్నారు.


