మాయలూరులో పిచ్చి కుక్క దాడి
● ఆరుగురు ఆసుపత్రిపాలు
ఉయ్యాలవాడ: మాయలూరు బస్టాండు సమీపంలోని చికెన్ సెంటర్ వద్ద గురువారం ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అల్లూరు గ్రామానికి చెందిన లక్ష్మి హర్షవర్ధన్ ఆచారి 9వ తరగతి విద్యార్థి, మాయలూరు గ్రామానికి చెందిన వెంకటేష్ 10వ తరగతి విద్యార్థి వీరివురు పాఠశాలకు వెళ్తుండగా అక్కడ తిరుగుతున్న పిచ్చి కుక్క దాడి చేసి చేయడంతో కాలు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మాయలూరు గ్రామానికి చెందిన పెద్ద తిరుపాలు, పుల్లన్న అనే ఇద్దరు వ్యక్తులు రైతు పొలంలో కూలి పనికి వెళ్తుండగా వారి మీద కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ నలుగురికి అక్కడే వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్సలు వైద్యాధికారి రాబర్డ్ కెనడి వైద్య చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే మధ్యాహ్నం అదే కుక్క గ్రామానికి చెందిన రామలింగారెడ్డి, రామసుబ్బయ్య అనే వ్యక్తులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా, చుట్టు పక్కల వారు చుట్టుముట్టి పిచ్చి కుక్కను చంపేశారు. ఈఎన్‌టీ మురళీక్రిష్ణ, ఫైలట్ రాజారెడ్డిలు వీరిని 108లో ప్రథమ చికిత్స చేసి కోవెలకుంట్లకు తీసుకెళ్లారు.


