జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మద్దికెర: చత్తీస్‌ఘడ్‌లో ఐటీబీపీ జవానుగా పని చేస్తూ అనారోగ్యంతో మృత్యువాత పడిన మద్దికెరకు చెందిన కసాపురం నాగార్జునకు (32) గురువారం గ్రామస్తులు, ఆర్మీ అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో సెలవుపై వచ్చి నాగార్జున బళ్లారిలో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజులుగా అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య భారతి, నాలుగేళ్ల కూతురు వున్నారు. గురువారం స్వగ్రామం మద్దికెరలో అంత్యక్రియలు నిర్వహించా రు. ఆర్మీ అధికారులు జవాను మృతదేహంపై జాతీ య పతాకం వుంచి గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పీలేరు ఐటీబీపీ ఆర్మీ అధికారులు ఎస్‌ఐ హరీష్‌కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసు లు, బాలాజీ, మద్దికెర పంచాయతీ సలహాదారు బండారు ఆంజనేయులు పాల్గొన్నారు.


