మద్యం మత్తులో తలారి హల్‌చల్
పాణ్యం: కౌలురు గ్రామ సచివాలయం వద్ద తలారి ఆంజనేయులు హల్‌చల్ చేశారు. బుధవారం సచివాలయానికి వివిధ పనుల కోసం వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామానికి చెందిన శివరామయ్య అనే వ్యక్తి ఇంటి పన్ను కట్టి రసీదు కోసం సచివాలయానికి వెళ్లగా అక్కడే మద్యం మత్తులో ఉన్న తలారి ఆంజినేయులు దరుసుగా ప్రవర్తించి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించి డీటీ శివశంకర్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు శివరామయ్య కుమారుడు నాగేంద్రయాదవ్ తెలిపారు.
టపాసులు సీజ్
ఆదోని అర్బన్: పట్టణంలో అనుమతి లేకుండా టపాసులు అమ్ముతుండగా అధికారులు సీజ్ చేశారు. షరాబ్ బజార్‌లోని మణికంఠ అనే దుకాణంలోని టపాసులు విక్రయిస్తున్న ట్లు స మాచారం రావడంతో ఆదోని సబ్‌కలెక్టర్ అజ య్‌కుమార్ బుధవారం తనిఖీ చేశారు. దాదాపు రూ.40 వేలు విలువ చేసే టపాసులను గుర్తించి సీజ్ చేసి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ఆదోని సెంట్రల్: ఆదోని–ఇస్వీ రైల్వేస్టేషన్‌ల మధ్య బుధవారం 55 సంవత్సరాల వయ స్సు గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయిసర్వేశ్వరరావు తెలిపారు. ఆదోని రైల్వేస్టేషన్ సమీపంలోని 495/34కే గేటు దగ్గర మృతదేహం లభ్యమయ్యిందన్నారు. మృతుడి కుడి చేతిపై కేసీ, ఎన్‌టీఆర్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరైనా గుర్తిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.
వివాహిత అదృశ్యం
కౌతాళం: కామవరం గ్రా మంలో వివాహిత కనపించడం లేదని సీఐ అశోక్‌కుమార్ తె లిపారు. బుధవారం ఆయన మాట్లాడు తూ.. గ్రామానికి చెంది న వీరేష్ భార్య వడ్డే కోటేశ్వరి(23) బుధవారం తెల్లవారు జామున 5గంటలకు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. కోటేశ్వరి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కామేశ్వరిదేవికి
లక్ష కుంకుమార్చన
మహానంది: కార్తీక మాసం పురస్కరించుకుని మహానందిలో కామేశ్వరిదేవికి బుధవారం లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ముఖ్య అర్చకులు వణిపెంట ప్రకాశం శర్మ, వేదపండితులు రుత్విక్ తదితరులు లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, జలాభిషేకం, రుద్రాభిషేకం చేపట్టారు.
మద్యం మత్తులో తలారి హల్‌చల్


